చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..

87
Eatala Rajender

కరీంనగర్ జిల్లాలోని రంగాపూర్, సిరసపల్లి, వెంకట్రావుపల్లి, పోతిరెడ్డిపేట గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మంగ‌ళ‌వారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జెడ్పి చైర్ పర్సన్ విజయ, హుజురాబాద్ మార్కెట్ చైర్మన్ రమా, సింగిల్ విండో చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు, గ్రామ సర్పంచులు ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. వర్షాల వల్ల రైతులు చాలా నష్టపోయారు. రైతులు అధైర్య పడవద్దని,చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. దళారులను నమ్మి మోస పోకూడదని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చినంక 24 గంటల్లో మిల్లుకు తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో రేష‌న్ కార్డు దారుల‌కు త్వ‌ర‌లోనే స‌న్న బియ్యం పంపిణీ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు.