2008 నాటి నుంచి ఐపీఎల్ ఆట భారత దేశంలో క్రికెట్‌పై ఆసక్తిని పెంచింది. దీంతో ప్రతి సంవత్సరం కూడా ఐపీఎల్ పై విపరీతమైన క్రేజీని సంపాదించుకొంది. దీనికి ద్వారా వ్యాపారం కూడా జోరుందుకుంది. అయితే తాజాగా 2023వ సీజన్‌లో అంతకుమించి అన్నట్టు మరింత ఆసక్తికరంగా మారనుంది. గతంలో కేవలం ఐపీఎల్ ఆరు భాషల్లోనే స్ట్రీమ్ కాగా ఇప్పుడు ఏకంగా 11భాషల్లో లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుందని వయోకామ్18 ప్రకటించింది. దీనికి సంబంధించిన బ్రాడ్ కాస్టింగ్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ సొంతం చేసుకొగా..ఈ యేడాది నుంచి వయోకామ్ 18 సంస్థకు చెందిన వూట్ యాప్‌లో కూడా స్ట్రీమింగ్ కానుంది. గతంలో డిస్నీ ప్లస్ హట్‌స్టార్‌లో ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ అయ్యేది.
వయోకామ్ 18 ఐపీఎల్‌ను 11 భాషల్లో ప్రసారం చేయాలని నిర్ణయించుకుంది. స్థానిక భాషల్లో ప్రసారం చేయడం ద్వారా అక్కడి వీక్షకులకు వూట్ యాప్ ద్వారా దగ్గరయ్యే ఛాన్స్ ఉంటుంది. మిగతా భాషలు మాట్లాడే వాళ్లు కూడా యాప్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారు. ఇంతకుముందు ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మాత్రమే ఐపీఎల్ స్ట్రీమ్ అయ్యేది. వీటితో పాటుగా భోజ్‌పూరి వంటి భాషల్లో కూడా స్ట్రీమ్ కానుంది. అయితే .
ఈ ఏడాది ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను వయోకామ్ 18 సంస్థ రూ.20,500 కోట్లకు దక్కించుకుంది. ఇంత మొత్తాన్ని సంపాదించుకోవాడానికి కావాల్సిన అన్వేషణను ప్రారంభించింది. ఈయేడాది ఐపీఎల్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా 550మిలియన్ల మంది చూస్తారని అంచనా వేస్తుంది. అందుకు తగ్గట్టుగా ఆదాయంను సమాకూర్చుకొవాలని వయోకామ్18 నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి…