మార్చి 22 నుండి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభంకఆనున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్లో ఆర్సీబీతో కోల్కతా నైట్ రైడర్స్ తలపడనుండగా ఇందుకుకోసం క్రికెట్ అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఐపీఎల్ అనగానే గుర్తుకొచ్చేది సిక్సర్ల వర్షం. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల వివరాలను పరిశీలిస్తే క్రిస్ గేల్ ముందు వరుసలో ఉన్నారు. పంజాబ్, కోల్కతా, బెంగళూరు జట్ల తరపున 142 మ్యాచ్లు ఆడి 357 సిక్సర్లు కొట్టాడు. ఇక రోహిత్ శర్మ 257 మ్యాచ్ల్లో 280 సిక్సర్లు బాదాడు.
కోహ్లీ 252 మ్యాచ్ల్లో 272 సిక్సర్లు బాదగా మహేంద్ర సింగ్ ధోని 264 మ్యాచ్ల్లో 252 సిక్సర్లు బాదాడు. డివిలియర్స్ 184 మ్యాచ్ల్లో 251 సిక్సర్లు బాదగా డేవిడ్ వార్నర్ 184 మ్యాచుల్లో 236 సిక్సర్లు, పొలార్డ్ 189 మ్యాచుల్లో 223 సిక్సర్లు కొట్టారు. అలాగే అండ్రూ రస్సెల్ 127 మ్యాచుల్లో 209 సిక్సర్లు, సంజూ శాంసన్ 168 మ్యాచుల్లో 206 సిక్సర్లు, సురేశ్ రైనా 205 మ్యాచుల్లో 203 సిక్సర్లు, షేన్ వాట్సన్ 145 మ్యాచుల్లో 190 సిక్సర్లు బాధాడు.
Also Read:ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

