2018..ఆస్కార్ అవార్డ్ విన్నర్స్‌…

252
2018 Oscars Winners...
- Advertisement -

సోమవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) ప్రతిష్టాత్మక 90వ అకాడమీ అవార్డుల (ఆస్కార్ అవార్డులు) ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగింది. ఈ ఏడాది ఏకంగా 13 విభాగాల్లో నామినేట్ అయిన ‘ది షేప్ ఆఫ్ వాటర్’ చిత్రం నాలుగు ఆస్కార్లను కైవసం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వంతో పాటు మరో రెండు అవార్డులు దక్కాయి. ఇక 8 విభాగాల్లో నామినేట్ అయిన ‘డన్‌కిర్క్’కు మూడు అవార్డులు వచ్చాయి. ‘డార్కెస్ట్ అవర్’ చిత్రంలో నటనకు గాను గ్యారీ ఓల్డ్‌మన్ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు.

ఇదిలా ఉండగా.. ప్రముఖ టాక్ షో వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్ ఆస్కార్ 2018 కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు. కిందటేడాది కూడా ఈయనే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

విజేతల వివరాలు :

ఉత్తమ చిత్రం – ది షేప్ ఆఫ్ వాటర్
ఉత్తమ నటుడు – గ్యారీ ఓల్డ్‌మన్ (డార్కెస్ట్ అవర్)
ఉత్తమ నటి – ఫ్రాన్సెస్ మెక్‌డోర్మాండ్ (త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సౌడ్ ఎబ్బింగ్, మిస్సౌరి)
ఉత్తమ దర్శకత్వం – గుల్లెర్మో డెల్ టోరో (ది షేప్ ఆఫ్ వాటర్)
ఉత్తమ సహాయ నటుడు – సామ్ రాక్‌వెల్ (త్రీ బిల్‌బోర్డ్స్ అవుట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సౌరి)
ఉత్తమ సహాయ నటి – అల్లిసన్ జన్నె (ఐ, టోన్యా)
ఉత్తమ లఘుచిత్రం (యానిమేటెడ్) – డియర్ బాస్కెట్‌బాల్
ఉత్తమ చిత్రం (యానిమేటెడ్) – కోకో
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – బ్లేడ్ రన్నర్ 2049
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ – లీ స్మిత్ (డన్‌కిర్క్)
ఉత్తమ ఒరిజినల్ స్కోర్ – అలెగ్జాండర్ డెస్ప్లాట్ (ది షేప్ ఆఫ్ వాటర్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – రిమెంబర్ మి: కోకో (సంగీతం: క్రిస్టెన్ అండెర్సన్, రచన: రాబర్ట్ లోపెజ్)
ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్) – హెవెన్ ఈజ్ ఎ ట్రాఫిక్ జామ్ ఆన్ ద 405
ఉత్తమ లఘుచిత్రం (లైవ్ యాక్షన్) – ది సైలెంట్ చైల్డ్
ఉత్తమ విదేశీ చిత్రం – ఎ ఫెంటాస్టిక్ ఉమన్ (చిలీ)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే – జేమ్స్ ఐవరీ (కాల్ మి బై యువర్ నేమ్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – జోర్డాన్ పీలే (గెట్ ఔట్)
ఉత్తమ ఛాయాగ్రహణం – రోజర్ ఎ. డీకిన్స్ (బ్లేడ్ రన్నర్ 2049)
ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలింగ్ – డార్కెస్ట్ అవర్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – మార్క్ బ్రిడ్జెస్ (ఫాంటమ్ త్రెడ్)
ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్) – ఐకారస్
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ – డన్‌కిర్క్
ఉత్తమ సౌండ్ మిక్సింగ్ – డన్‌కిర్క్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – ది షేప్ ఆఫ్ వాటర్

- Advertisement -