బ్రేక్‌ లేదు…మళ్ళీ రిపీట్‌..

207
samantha next movie with stylish star

సమంత అక్కినేని.. ఇప్పుడు’యూటర్న్‌’ తో ఫుల్‌ బిజీ. శివ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ తర్వాత కొన్నాళ్ళపాటు సినిమాలకు సమంత బ్రేక్‌ తీసుకోనుందని ఇప్పటివరకు టాక్‌. కానీ..సామ్ సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చేసింది.

తాజా సమాచారం ప్రకారం స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌తో నటించేందుకు గ్రీన్‌ సిగ్నలిచ్చిందట ఈ బ్యూటీ. దీనికి సంబంధించిన న్యూస్‌ ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో జోరుగానే వినిపిస్తోంది. కాగా..’నాపేరు సూర్య’ తర్వాత బన్నీ నెక్ట్స్‌ సినిమా ఏంటనే ఆతృత ఫ్యాన్స్ లో ఎప్పుడో మొదలైంది. మ‌నం, 24 వంటి అద్భుత చిత్రాలు తెర‌కెక్కించిన విక్ర‌మ్ కుమార్ డైరెక్ష‌న్‌లో బన్ని నెక్ట్స్‌ మూవీ రానున్నట్టు తెలుస్తోంది.

 samantha next movie హ‌లోతో ఫెయిల్యూర్ ఎదుర్కొన్న విక్ర‌మ్ కుమార్ త‌ర్వాతి ప్రాజెక్ట్‌ని చాలా ప్ర‌తిష్టాత్మకంగా తీసుకొని తెర‌కెక్కించ‌నున్నాడు. అందుకే బన్నీకి జోడీగా సమంత ను విక్రమ్ ఫిక్స్‌ అయినట్టు సమాచారం. కాగా..‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఆడియెన్స్‌ ని అట్రాక్ట్‌ చేసిన ఈ పెయిర్.. మరోసారి రిపీట్ అవుతున్న క్ర‌మంలో అభిమానుల‌లో ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. స‌మంత‌తో పాటు మ‌రో హీరోయిన్ ఈ చిత్రంలో నటించ‌నుంద‌ని అంటున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.