20 ఏళ్ళు పూర్తి చేసుకున్న ‘నువ్వు నేను’..

814
Nuvvu Nenu Movie
- Advertisement -

తేజ దర్శకత్వంలో చిత్రం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఉదయ్ కిరణ్ భారీ విజయాన్ని అందుకున్నాడు.. చిత్రం సినిమా తర్వాత ఏడాది ఖాళీగానే ఉన్న ఉదయ్. మరోసారి తేజతో మరో సినిమా చేశాడు.. అదే నువ్వు నేను. ఆగస్ట్ 10, 2001న విడుదలైన ఈ చిత్రానికి నేటితో 20 ఏళ్ళు పూర్తయ్యాయి. అప్పట్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూసి ట్రేడ్ కూడా షాక్ అయింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు చాలా మంది స్టార్ హీరోల సినిమాలు కూడా అప్పట్లో అంత వసూలు చేయలేదు. కానీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఉదయ్ మాత్రం నువ్వు నేనుతో ప్రభంజనం సృష్టించాడు.

నువ్వు నేను సినిమాను అప్పట్లో 3.2 కోట్లకు బిజినెస్ చేశారు. విడుదలైన తొలిరోజు మార్నింగ్ షో నుంచే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఉదయ్ కిరణ్ నటన.. అనిత పర్ఫార్మెన్స్.. సునీల్ కామెడీ.. తెలంగాణ శకుంతల, తణికెళ్ల భరణి కాంబినేషన్.. ఆర్పీ పట్నాయక్ పాటలు.. ఒకటేంటి నువ్వు నేను సినిమాకు అన్నీ కలిసొచ్చాయి. దాంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఒకటి రెండు కాదు నిర్మాతలకు, బయ్యర్లకు ఏకంగా 13 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. అందుకే 20 ఏళ్లైనా కూడా టాలీవుడ్‌ చరిత్రలో ఈ సినిమా ఒక నువ్వు అద్భుతంగా నిలిచింది.

నైజాం: 4.65 కోట్లు
సీడెడ్: 1.55 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.62 కోట్లు
ఈస్ట్: 1.11 కోట్లు
వెస్ట్: 0.89 కోట్లు
గుంటూరు: 0.93 కోట్లు
కృష్ణా: 0.85 కోట్లు
నెల్లూరు: 0.52 కోట్లు

ఏపీ + తెలంగాణ: 12.09 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 3.44 కోట్లు
వరల్డ్ వైడ్: 15.39 కోట్లు

- Advertisement -