10న .. ’16 ఎవ్రీ డీటెయిల్‌ కౌంట్స్‌‌’

218
16 every detail counts on March 10th
- Advertisement -

శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ నుంచి అభిరుచిగ‌ల చిత్రాలు వ‌రుస‌గా వ‌స్తున్న సంగ‌తి విదిత‌మే. ఆ కోవ‌లోనే త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్‌  `ధురువంగ‌ల్ ప‌దినారు` (డి-16) తెలుగులో `16 ఎవ్రీ డీటెయిల్‌ కౌంట్స్‌‌` పేరుతో అనువాదం పూర్తి చేసుకుని మార్చి 10న రిలీజ‌వుతోంది. రెహ్మాన్ హీరోగా న‌టించిన  ఈ చిత్రానికి కార్తీక్ న‌రేన్ ద‌ర్శ‌క‌త్వ  వ‌హించారు.

ధృవ సినిమాలో అర‌వింద్ స్వామి పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పిన సింగ‌ర్ కం మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేమ‌చంద్ర ఈ చిత్రంలో హీరో పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్ప‌డం హైలైట్‌. ఫ‌స్ట్‌లుక్ స‌హా ట్రైల‌ర్ల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ఇటీవలే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ బృందం యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి అద్భుత థ్రిల్ల‌ర్ చిత్ర‌మిద‌ని కితాబిచ్చింది. తెలుగులో పెద్ద విజ‌యం సాధించే చిత్ర‌మ‌ని సెన్సార్ స‌భ్యులు ప్ర‌శంసించారు.

ఈనెల‌ 10న సినిమాని రిలీజ్ సంద‌ర్బంగా.. నిర్మాత చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి మాట్లాడుతూ -త‌మిళంలో సంచ‌ల‌న వ‌సూళ్లు సాధించిన‌ `ధ‌రువంగ‌ల్ ప‌దినారు` చిత్రాన్ని తెలుగులో `16 ఎవ్రీ డీటెయిల్‌ కౌంట్స్‌‌` పేరుతో అనువ‌దించాం. అన్నిపనులు పూర్త‌య్యాయి. సెన్సార్ స‌భ్యులు యుఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి ప్ర‌శంసించారు. తెలుగు ప్రేక్ష‌కుల్ని థ్రిల్‌కి గురి చేసే చిత్ర‌మిద‌ని కితాబిచ్చారు. హాలీవుడ్ స్థాయిలో ఉత్కంఠ‌భ‌రితంగా తెర‌కెక్కిన థ్రిల్ల‌ర్ ఇద‌ని ఆస్కార్ సంగీత ద‌ర్శ‌కుడు ఏ.ఆర్‌.రెహ‌మాన్, అర‌వింద‌స్వామి, మంచు మ‌నోజ్ వంటి ప్ర‌ముఖులు ప్ర‌శంసించ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగాయి. ఈనెల 10న ప్రేక్ష‌కుల ముందుకు తెస్తున్నాం. త‌మిళులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన‌ట్టే తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌న్న న‌మ్మ‌కం ఉంది. తెలుగులో అన్నివార్గాల‌ ప్రేక్ష‌కుల్ని మెప్పించే చిత్ర‌మిది“ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:సుజిత్ స‌రంగ్, సంగీతం: జాకేష్ బిజోయ్.

- Advertisement -