‘సన్నీ’లా సంతోషాన్ని పంచండి : వర్మ

179
Varma wishes all women to make men happy like Sunny
- Advertisement -

నోటి దురుసుతో నిత్యం వార్తల్లో ఉండే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ..మహిళా దినోత్సవంపై మరోసారి వివాదాస్పద ట్వీట్స్ చేశాడు. ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ తాను శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు వర్మ ట్వీట్ చేశాడు. ‘పురుషులకు సన్నీ లియోన్ ఇచ్చింనంత సంతోషాన్ని.. ఈ ప్రపంచంలోని అందరు మహిళలు ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ  వర్మ ట్వీట్టేశాడు.

పురుషులకు మెన్స్ డే లేదు ఎందుకంటే అన్ని రోజులు మగవాళ్లవే. అందుకే ఒక రోజు ఆడవాళ్లకు కేటాయించారు అని మరో ట్వీట్ లో పేర్కొన్నాడు. అంతటితో ఆగలేదు వర్మ ఉమెన్స్ డేను తప్పకుండా మెన్స్ డే అని పిలవాలి. ఎందుకంటే మహిళల కంటే ఆ దినోత్సవాన్ని పురుషులే జరుపుకుంటారని వరుస ట్విట్లలో పేర్కొన్నాడు.కనీసం పురుషుల దినోత్సవం రోజున గొడవ పెట్టుకోకుండా అరవకుండా మగవాళ్లకు స్వేచ్ఛనివ్వాలి . మహిళల కోసం పురుషులు ఏమి చేస్తున్నారో అర్దం కావడం లేదు. కానీ ఏదో ఒకరోజు మహిళా,పురుష దినోత్సవాన్ని అందరూ కలిసి జరుపకోవాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నాడు.

ఇవాళ మహిళా దినోత్సవం. అందరూ కాకపోయినా ప్రపంచవ్యాప్తంగా మహిళలు చాలామంది సెలబ్రేట్ చేసుకునే.. ప్రత్యేకంగా గుర్తుంచుకునే రోజు. ఇలాంటి ప్రత్యేకమైన రోజు సందర్భంగా.. మహిళలను ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. మహిళా దినోత్సవంపై వర్మ చేసిన ట్వీట్స్ దుమారాన్ని రేపుతున్నాయి. వర్మపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ఆదర్శ మహిళలు.. విజయాలు సాధించిన ఘనకీర్తి పొందిన లేడీస్ ఉండగా.. పోల్చడానికి  సన్నీ లియోన్ తప్ప వేరెవరూ రోల్ మోడల్ దొరకలేదా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -