తెలుగులో రెహమాన్‌ ‘ఒరు ముగత్తిరై’..

225
Rahman Oru Mugathirai To Be Released In Telugu

తమిళ నటుడు రెహమాన్‌ తెలుగువారికి బాగా సుపరిచితుడే. ఆయన నటించిన ‘16 – ఎవ్రీ డీటైల్‌ కౌంట్స్‌’ ఇటీవల తెలుగులో విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది. అటు విమర్శకుల ప్రశంసల్ని, ఇటు బాక్సాఫీసు వసూళ్లను కూడా రాబట్టుకుంది. రెండో వారంలోనూ చక్కటి థియేటర్లలో, మంచి వసూళ్లతో ప్రదర్శితమవుతోంది. ‘16-ఎవ్రీ డీటైల్‌ కౌంట్స్‌’ చిత్రానికి గానూ మిగిలిన అందరితోనూ పోలిస్తే రెహమాన్‌కు మరింత మంచి పేరు వచ్చింది.

Rahman Oru Mugathirai To Be Released In Telugu

తాజాగా ఆయన నటించిన ‘ఒరు ముగత్తిరై’ తెలుగులోకి అనువాదం కానుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రాన్ని వేసవికి విడుదల చేయనున్నారు. డి.వెంకటేశ ఈ చిత్రం హక్కులను తీసుకున్నారు. డీవీ సినీ క్రియేషన్స పతాకంపై ఈ సినిమాను ఆయన తెలుగులో విడుదల చేస్తున్నారు. జీవా, కాజల్‌ నటించిన ‘ఎంతవరకు ఈ ప్రేమ’ చిత్ర నిర్మాత ఇతనే. ‘ఒరు ముగత్తిరై’కు సెంథిల్‌నాథన దర్శకత్వం వహించారు.

ఇది థ్రిల్లర్‌ చిత్రం. ఓ సైకియాట్రిక్‌ డాక్టర్‌కి సంబంధించిన కథ ఇది. సైకాలజీ విద్యార్థిని ఇష్టపడి మానసికంగా ఇబ్బందులకు గురైన సైకియాట్రిక్‌ డాక్టర్‌కు సంబంధించిన కథతో తెరకెక్కింది. అదితి, దేవికా మాధవన, ఢిల్లీ గణేశ, మీరా కృష్ణన ఇందులో కీలక పాత్రధారులు.