తెలంగాణ భవన్‌కు 15 ఏళ్ళు: ఎంపీ సంతోష్‌

270
ts bhavan new
- Advertisement -

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) . 2001 ఏప్రిల్ 27 న టీఆర్ఎస్‌ను స్ధాపించారు కేసీఆర్. క్షేత్రస్ధాయిలో గ్రామస్ధాయి నుండి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసి స్వరాష్ట్రాన్ని సాధించారు.

ఇక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు నందినగర్ , హైదరాబాద్ లోని కేసీఆర్‌ నివాసానికి మారాయి. తర్వాత ఎమ్మెల్యే కాలనీలోని మాజీ మంత్రి వేదంతరావు ఇంటికి పార్టీ కార్యాలయాన్ని మార్చారు. ఇక 2004లో వైఎస్‌ ప్రభుత్వం బంజారాహిల్స్‌‌ రోడ్​ నంబర్​ 12లో ప్రస్తుతం తెలంగాణ భవన్​ ఉన్న స్థలాన్ని టీఆర్‌ ఎస్‌ కు కేటాయించింది. 2006లో సరిగ్గా ఇదే రోజు తెలంగాణ భవన్‌ ను ప్రారంభించారు.

తెలంగాణ భవన్ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్. పదిహేను సంవత్సరాల క్రితం తెలంగాణ గుర్తింపు,సంస్థాగతీకరణలో భాగంగా మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ నిర్మించారు. ఈ భవన్ యావత్ తెలంగాణ కు గర్వకారణం…మనందరం గర్వించదగిన క్షణాలు అంటూ పేర్కొన్నారు సంతోష్‌.

- Advertisement -