ఈ నెల 27 న వరంగల్ లో నిర్వహిస్తున్న పార్టీ రజతోత్సవ సభ ఘనం నిర్వహించ బోతున్నాం అన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన తసాని… గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య నాయకులం సభ విజయవంతం చేయడానికి అనుసరించాల్సిన కార్యాచరణ పై చర్చించాం అన్నారు.
రేపటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ నియోజకవర్గ స్థాయి మీటింగ్ లు జరుగుతాయి …ఈ నెల 20 గ్రేటర్ హైదరాబాద్ బీ ఆర్ ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని తెలంగాణ భవన్ లో నిర్వహిస్తాం అన్నారు. 27 న పార్టీ వ్యవస్థాపక రోజు తెలంగాణ కు పండగ రోజు …ఆ రోజు ప్రతి డివిజన్ లో బీ ఆర్ ఎస్ జెండా ఎగురేసి వరంగల్ మీటింగ్ కు కార్యకర్తలు ,అభిమానులు బయలు దేరుతారు అన్నారు.
కేసీఆర్ ఉద్యమ నాయకుడిగానే కాదు ముఖ్యమంత్రి గా తెలంగాణ ఖ్యాతిని దశ దిశలా వ్యాపింప జేశారు .. …పదేళ్ల కేసీఆర్ పాలన తెలంగాణ కు స్వర్ణయుగం …కాంగ్రెస్ పదహారు నెలల పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందుల్లో ఉన్నాయి అన్నారు. కేసీఆర్ కు సంఘీభావం ప్రకటించేందుకు ప్రజలు వరంగల్ సభకు పెద్ద ఎత్తున కదలాలి ..గ్రేటర్ హైదరాబాద్ నుంచి వరంగల్ సభకు పెద్దఎత్తున ప్రజలు హాజరవుతారు..వారికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.
Also Read:బీజేపీకి రూ.2,243 కోట్ల విరాళాలు..!

