దేశంలో 24 గంట‌ల్లో 12,213 క‌రోనా కేసులు..

34
covid19
- Advertisement -

దేశంలో క‌రోనా కేసులు రోజు రోజు కి పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి మళ్ళీ కోరలు చాస్తోంది. గ‌త 24 గంట‌ల్లో 12,213 కేసులు న‌మోదుకాగా దీంతో మొత్తం కేసులు 4,32,57,730 కు చేరాయి. క‌రోనా నుండి 4,26,74,712 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో 5,24,803 మంది మృతిచెందారు.

ప్ర‌స్తుతం దేశంలో 58,215 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.13 శాతానికి చేరాయి, రికవరీ రేటు 98.65 శాతంగా ఉంది. ఇప్పటిరకు 195.67 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

- Advertisement -