హడలెత్తిస్తున్న వర్మ 12′ O క్లాక్ ట్రైలర్..

33
12 o CLOCK Movie

రాంగోపాల్‌ వర్మ హారర్‌ నేపథ్యంలో 12′ O క్లాక్‌ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ విడుదలయింది. హారర్ దృశ్యాలతో ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ఒక్క డైలాగు కూడా లేకుండా ఈ ట్రైలర్ సాగుతుంది. సైన్స్‌కు, ఆత్మలకు ఏదైనా సంబంధం ఉందా? అనే అంశంపై కథను నడిపించారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని రుచి చూపేలా ఈ సినిమా తీసినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

ఇది షార్ట్ ఫిలిం కాదని, పూర్తి స్థాయి సినిమా అని వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో మకర్‌దేశ్‌ పాండే, మిథున్‌ చక్రవర్తి, ఆశిష్‌ విద్యార్థి, దిలీప్‌ తాహిల్‌, మానవ్‌ కౌల్‌, అలీ అజగర్‌, తదితరులు నటించారు. సినిమాటోగ్రఫీ అమోల్‌ రాథోడ్‌ అందించారు. జనవరి 8న ఈ సినిమా విడుదల కానుంది. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు.