సునీత.. ఆ కోరిక తీర్చేనా !

698
Singer sunita
Singer sunita
- Advertisement -

సునీత… హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం ఆమెది. అందుకే గాయని అయినా… అందంతోనే ఆమె ఎక్కువగా ప్రేక్షకుల మనసులోనిలిచిపోయారు. ఆమె పాట కంటే.. అందానికే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారంటే అతిశయోక్తి కాదు. గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా, యాంకర్‌గా ఆమెకు మంచిపేరు ఉంది. సునీత సినిమాల్లో నటిస్తే చూడాలని చాలామంది ఫ్యాన్స్ కోరిక. ఆమెను తమ సినిమాల్లో నటింపజేయడానికి కొంతమంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు కూడా. అయితే ఎందుకో తెలియదు ఏ ఒక్క అవకాశానికి సునీత ఎస్ చెప్పలేదు. ఇటీవల బ్రహ్మోత్సవం సినిమాలో సునీత నటిస్తోందని వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలను సునీత కొట్టిపారేసింది.

ప్రస్తుతం సునీత నటించాడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అది సినిమాలో కాదు ఓ షార్ట్ ఫిల్మ్లో. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. చైతన్య శ్రీ పెరంబదూర్ ఈ షార్ట్ ఫిల్మ్‌కి దర్శకుడు. సినిమాలకు దూరంగా ఉన్న సునీత.. ఈ షార్ట్ ఫిల్మ్ చేయడానికి కారణమేంటో తెలియదు. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ తరువాత సునీత సినిమాల్లోనూ నటిస్తుందనే టాక్ వినిస్తోంది. అది ఎంత వరకు నిజమో తెలియాలంటే కాస్త ఆగాల్సిందే..

https://www.youtube.com/watch?v=l_aQyqULJ6o

- Advertisement -