మోక్షజ్ఞ ఎంట్రీ.. బాలయ్య ఫుల్ ఖుషీ !

679
balaiah
balaiah
- Advertisement -

వారసుడు ఎంట్రీ ఇవ్వకముందే నందమూరి బాలయ్య ఫుల్ ఖుషీ అవుతున్నాడు. రీసెంట్ గా మోక్షజ్ఞ బర్త్ డే నేపధ్యంలో నంద‌మూరి ఫ్యాన్స్ చేసిన సందడిఅంతా ఇంతా కాదు. దీంతో సోషల్ మీడియాలో నందమూరి వారసుడు ట్రెండింగ్ లో దూసుకుపోయాడు. విషయం తెలుసుకున్న బాలయ్య వారసుడి విషయంలో తెగ సంతోషపడిపోయాడట. దీన్ని దృష్టిలో ఉంచుకుని మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై కూడా బాలయ్య చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌. మోక్ష‌జ్ఞ ఎలాంటి మూవీ చేస్తే బాగుంటుంది. దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలి అనే విష‌యాలపై బాల‌య్య స‌న్నిహితుల‌తోచ‌ర్చిస్తున్నార‌ట. ఫైనల్ గా మోక్ష‌జ్ఞ‌ తొలి చిత్రాన్ని భారీ ఫైటింగ్స్, ఛేజింగ్స్ తో తీయోద్దని, యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని బాలయ్య భావిస్తున్నాడట.

ఇక బాల‌య్య వందోచిత్రంలో మోక్ష‌జ్ఞ స్పెష‌ల్ రోల్ చేయడంలేదని లేటెస్ట్ టాక్. సోలోగానే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని నందమూరి కుటుంబ సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. సింగీతం శ్రీనివాసరావు ఆదిత్య 369 సీక్వెల్ ను మోక్షజ్ఞ తో కాకుండా బాలయ్యే చేస్తాడని సమాచారం. అయితే ఈ వార్తలపై నందమూరి ఫ్యాన్స్ కొంత డిజప్పాయింట్ అవుతున్నారు. మోక్షజ్ఞ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో కాకుండా ఆదిత్య369 సీక్వెల్ కానీ, ఇంకేదైనా పవర్ ఫుల్ రోల్ కాని ఎంట్రీ ఇస్తే బాగుంటుందని కొరుతున్నారు. మొత్తానికి తనయుడి విషయంలో బాలయ్య ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Courtesy: Yo Yo TV

- Advertisement -