ఆ యాంకర్ పెళ్లి ఉత్తదే

48
- Advertisement -

యాంకర్ రష్మీ గౌతమ్ పెళ్లి అంటూ ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. ఐతే, ఆ పెళ్లి లొల్లి ఉత్తదే. రష్మీ గౌతమ్ కి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదట. అయినా, ఎప్పటికప్పుడు రష్మీ పెళ్లి అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. హీరోలలో ప్రభాస్ పెళ్లి గురించి ఎన్ని పుకార్లు వచ్చాయో యాంకర్స్ లో రష్మీ గౌతమ్ కి కూడా అలాంటి ట్రాక్ రికార్డు ఉంది. రష్మీ పెళ్లి గురించి ఎన్నెన్నో వార్తలు. “రష్మీ గౌతమ్ ఫలానా బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకోబోతోంది. పెళ్లి ముహూర్తం సెట్ అయింది. రష్మీ తల్లితండ్రులు ఓకే చెప్పారు…” అంటూ గత నెలలో చాలా హడావిడి జరిగింది.

కొత్త ఏడాది స్టార్టింగ్ లోనే రష్మీ గౌతమ్ పెళ్లి అంటూ వచ్చిన వార్తలు విన్నాం. ఈ అమ్మడు గత కొంత కాలంగా వైజాగ్ కి చెందిన ఓ హోటల్ బిజినెస్ మెన్ తో సీక్రెట్‌గా ప్రేమ వ్యవహారాన్ని నడుపుతోందని సోషల్ మీడియాలో టాక్ కూడా బాగా నడిచింది. ఆ బిజినెస్ మెన్ బాయ్ ఫ్రెండ్ తోనే రష్మీ గౌతమ్ మ్యారేజ్ అంటూ యూట్యూబ్, వెబ్ సైట్లు, ఛానెల్స్ హోరెత్తించాయి. తీరా ఇప్పుడు అదంతా ఉత్తిదే అని తేలింది.

పైగా రష్మీ గౌతమ్ కి పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదట. ఒకవేళ భవిష్యత్తులో పెళ్లి పై ఇంట్రెస్ట్ కలిగితే.. అప్పుడు స్వయంగా మీడియాకి చెప్పే పెళ్లి చేసుకుంటాను అంటూ రష్మీ చెప్పుకొచ్చింది. మొత్తమ్మీద రష్మీ గౌతమ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నది అని వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు.

ఇవి కూడా చదవండి…

మైఖేల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నాని

దళపతి67..త్రిష కృష్ణన్‌

విజయ్ ఫాన్స్ కు సమంత సారీ

- Advertisement -