రేషన్ కార్డ్‌ కోసం పోతే… రేప్ చేశాడు

316
AAP Sandeep booked for rape
AAP Sandeep booked for rape
- Advertisement -

ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సందీప్ కుమార్ సెక్స్‌ సీడీ కేసు మరో మలుపు తిరిగింది. ఢిల్లీ పోలీసులు ఆయనపై రేప్ కేసు నమోదు చేశారు. సందీప్ కార్యాలయానికి రేషన్ కార్డు కోసం వెళ్లగా, మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారని, తాను అపస్మారకస్థితిలో ఉన్నప్పుడు ఆయన తనపై అత్యాచారం చేశాడని సీడీలో ఉన్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు చేసిన కొన్నిగంటలకే నాటకీయ పరిణామాల మధ్య సందీప్‌ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా సందీప్‌ను తొలగించారు. బాధితురాలు చేసిన ఆరోపణలు నిజమైతే, సందీప్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. రాసలీలల సీడీ బయటపడగానే మంత్రి పదవి నుంచి సందీప్‌ను తొలగించిన విషయం తెలిసిందే.

రాసలీలల సీడీలో అడ్డంగా దొరికిపోయి మంత్రి పదవిని కోల్పోయిన ఆమ్ అద్మీ పార్టీ నేత సందీప్‌కుమార్‌ను వెనకేసుకువచ్చిన ఆ పార్టీ ప్రతినిధి అశుతోష్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. సెక్స్ స్కాండిల్లో కూరుకుపోయిన సందీప్‌ను ఆప్ నేత అశుతోష్ వెనకేసుకు రావడమే కాకుండా.. ‘సందీప్ చేసిన తప్పేంటి?’, ‘పరస్పర అంగీకారంతో జరిగిన ప్రైవేట్ ఎఫైర్‌ను రచ్చకీడుస్తారా?’ అంటూ తన బ్లాగ్‌లో అశుతోష్ రెచ్చిపోయారు.

అంతటితో ఆగకుండా రాసలీలల సందీప్‌ను…జాతిపిత మహాత్మాగాంధీతో ఆయన పోల్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్ దూరపు బంధువుతో బాపూజీకి సంబంధాలు నెరపారని, తన నిగ్రహశక్తిని పరీక్షించుకునేందుకు ఆయన తన మేనకోడళ్లతో కలిసి ఒంటిపై నూలుపోగు లేకుండా నిద్రించారని ఆరోపణలు చేశారు. భారత తొలి మాజీ ప్రధాని పండిట్ జవహర్‌వాల్ నెహ్రూ, రెండుసార్లు ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అయితే ఒక సెక్స్ స్కాండిల్‌లో చిక్కుకున్న వ్యక్తిని ‘గట్టెక్కించే’ ప్రయత్నంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆయనను వివాదాల్లో పడేశాయి.

- Advertisement -