ఒకే దేశం..ఒకే రేషన్ కార్డు

543
Ration Card
- Advertisement -

ఇప్పటి వరకు ఏ ప్రాంతంలో ఉంటే అక్కడ మాత్రమే రేషన్ కార్డును వినియోగించుకునేవారు. కానీ వచ్చే ఏడాది జూన్ 1నుంచి రేషన్ కార్డును దేశంలోని ఏ ప్రాంతంలోనైనా వినియోగించుకోవచ్చని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో ఎక్కడైనా రేషన్ కార్డును వాడుకోచ్చని తెలిపారు కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్. వచ్చే ఏడాది జూన నుంచి ఒకే దేశం..ఒకే రేషన్ కార్డు పథకం ప్రారంభంకానున్నట్లు తెలిపారు. పొట్టచేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి సైతం రేషన్ దక్కాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్డును తీసుకురాబోతోందని తెలిపారు.

రేషన్ కార్డును మార్చుకోవాల్సిన అవరసం లేదన్నారు. పాత రేషన్ కార్డు నెంబర్ ఉంటే సరిపొతుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులు జారీ చేశాయని..కానీ ఇప్పటి నుంచి దేశం మొత్తం ఒకటే కార్డు ఉండనున్నట్లు తెలిపారు కేంద్రమంత్రి రాంవిలాస్. వలస వెళ్లిన వారికి ఇబ్బంది కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కేంద్ర తీసుకున్న ఈనిర్ణయంపై వలస వెళ్లిన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -