యుద్ధం శ‌ర‌ణం అంటున్న చైతు.. సమంత

281
Yuddham Sharanam Audio Launch
- Advertisement -

యుద్ధం శరణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి నాగ చైతన్య రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో చైతూ  కొత్త లుక్ తో .. కొత్త కోణంలో కనిపించనున్నాడు. ఈ సినిమాను వచ్చే నెల మొదటివారంలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.   ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన ఆడియో రిలీజ్ ను ఘనంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Yuddham Sharanam Audio Launch

జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ లో జరగబోతున్న ఈ ఆడియో వేడుకకు చైతూ మేనమామ, విక్టరీ వెంకటేష్, తమ్ముడు అఖిల్ అక్కినేని, కాబోయే భార్య సమంత ముఖ్య అతిధులుగా హాజరవ్వబోతున్నారని తెలుస్తోంది. ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత సమంత, నాగచైతన్య కలిసి అక్కడ అక్కడ కనిపిస్తున్నారు. కాకపోతే ఆడియో వేడుకలో ఇద్దరూ కలిసి పాల్గొనడం ఇదే మొదటిసారి. దాంతో ఈ కాబోయే భార్య భర్తలు వేదికపైన ఏం మాట్లాడతారా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

వెంకటేశ్ .. సమంతా .. అఖిల్ .. ఈ ముగ్గురికీ కూడా మంచి ఫాలోయింగ్ వుంది. వాళ్ల రాకవలన ఈ సినిమా వైపుకు మరింతమంది దృష్టిని మళ్లించవచ్చనే ఆలోచనలో వున్నారు.వారాహి చలన చిత్రం బ్యానర్ పై కృష్ణ.ఆర్.వి.మారి ముత్తు దర్శకత్వంలో రజని కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. చైతూ సరసన లావణ్య త్రిపాఠి జత కట్టింది.  ఇప్పటికే ‘ప్రేమమ్’ .. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలతో సక్సెస్ ను అందుకున్న చైతూ, ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.

- Advertisement -