బిగ్ బాస్‌ హౌస్‌లోకి తేడా సింగ్!

209
Balaih to Attend Bigg Boss Show
- Advertisement -

నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా పైసా వసూల్‌. ఇటీవల విడుదలైన ఈ సినిమా స్టంపర్‌,ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా బాలయ్య డైలాగ్‌లకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఖమ్మంలో ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ ఘనంగా జరగగా సెప్టెంబర్‌ 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌లో సినిమా యూనిట్ బిజీగా ఉంది.

ఈ క్రమంలో బుల్లితెరపై టాప్ రేటింగ్‌లో కొనసాగుతున్న బిగ్ బాస్‌పై బాలయ్య టీం కన్నుపడింది. ఇటీవల విడుదలైన సినిమాల ప్రమోషన్‌ల కోసం బిగ్ హౌస్‌లోకి రానా,విజయ్ దేవరకొండ, తాప్సీ ఎంటరవగా తాజాగా బాలయ్య బాబు బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఇప్పుడు ఇదే వార్త టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వార్త‌లో నిజ‌మెంతుందో తెలియ‌క‌పోయినా `అబ్బాయి కార్య‌క్ర‌మానికి బాబాయ్‌` అంటూ అప్పుడే అభిమానులు ఫేస్‌బుక్ పోస్టులు ప్రారంభించారు.   బాలయ్య ఎంట్రీతో సినిమాకు ప్రమోషన్ తో పాటుగా బాలయ్య ఎన్.టి.ఆర్ ల మధ్య ఉన్న దూరం కూడా చెరిగిపోయేలా స్కెచ్ వేస్తున్నారట. ఇప్పటికే రేటింగ్‌లో నెంబర్‌ 1గా దూసుకుపోతున్న బిగ్ బాస్‌ షో బాలయ్య ఎంట్రీతో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -