టీ హబ్‌పై ప్రధాని ప్రశంస

231
Sher Bahadur Deuba Praises T Hub
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువరు ఐటీ దిగ్గజాలు టీ హబ్ దేశానికే ఆదర్శం అంటూ కొనియాడగా తాజాగా  నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ నగర పర్యటనకు వచ్చిన నేపాల్ ప్రధాని.. ఐటీ అధికారులతో కలిసిగచ్చిబౌలిలోని టీ హబ్‌తో ఇన్ఫోసిన్ క్యాంపస్‌ను  సందర్శించారు.

 Sher Bahadur Deuba Praises T Hub
టీ హబ్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు.  స్టార్టప్ ఇంక్యుబేటర్ అద్భుతంగా ఉందని ప్రధాని దేవ్‌బా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. నేపాల్‌లో కూడా టీ హబ్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను దేవ్‌బా కోరారు. దీనికి సంబంధించిన విషయాలపై త్వరలోనే నేపాల్ అధికారులు, వ్యాపారులు తెలంగాణ ప్రభుత్వంతో సమావేశమై రోడ్‌మ్యాప్ తయారు చేస్తారని ఈ సందర్భంగా జయేష్ రంజన్ తెలిపారు.

 Sher Bahadur Deuba Praises T Hub

నగర పర్యటనకు వచ్చిన నేపాల్ ప్రధానికి గౌరవార్థం ఫలక్‌నూమా ప్యాలెస్‌లో గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత పాల్గొని.. నేపాల్ ప్రధానికి బతుకమ్మను బహుకరించారు.

ఐటీ రంగంలో తెలంగాణ యువత ఆలోచనలకు రెక్కలు తొడిగేందుకు మంత్రి కేటీఆర్ టీ హబ్‌ను ముందుకు తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఇంక్యుబేషన్ సెంటర్లతో ఉత్సాహవంతులైన యువతకు టీ హబ్ అండగా నిలిచింది. ఐటీలో శరవేగంగా దూసుకుపోతున్న తెలంగాణ…ఇటీవలె గోవా ప్రభుత్వంతో ఎంవోయు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

టీ హబ్‌కు ఏడాది…త్వ‌ర‌లో టీహ‌బ్‌-2కు శంకుస్థాప‌న‌
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీహబ్ సక్సెస్ కావటంతో ఫేస్ 2 సన్నాహాలు చేస్తోంది. ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించి పనులు చకచకా సాగుతున్నాయి. టీహబ్ 2  బిల్డింగ్ మోడల్స్‌ను కేటీఆర్ ఇటీవల ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయగా…. ఆధునిక టెక్నాలజీ.. ప్రస్తుతం ఉన్న దానికి నాలుగు రెట్లు అధికంగా ఈ నిర్మాణం జరగనుంది. ప్రస్తుతం 150 స్టార్టప్ కంపెనీలు టీహబ్ లో ఉండగా.. కొత్తగా నిర్మించబోయే భవనంలో 600 నుంచి వెయ్యి స్టార్టప్ కంపెనీలకు అవకాశం ఉంటుంది. ఆల్ట్రా మోడల్ గా దీన్ని తీర్చిదిద్దనున్నారు. త్వరలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

KCR will lay the foundation for T-Hub-2 soon

KCR will lay the foundation for T-Hub-2 soon

T hub

KCR will lay the foundation for T-Hub-2 soon

- Advertisement -