మూన్‌పై పోయిన రింగ్‌ దొరికింది..

249
moon ring
- Advertisement -

భార్యభర్తల అపురూప జ్ఞాపకం పెళ్లి ఉంగరం. ఈ ఉంగరం పోయిన ఘటనలు మనం తరచుగా చూస్తునే ఉన్నాం. అయితే ఓ భర్త తన ఉంగరాన్ని ఏకంగా చంద్రుడి మీదే పొగొట్టుకున్నాడట. ఉంగరం చంద్రుడిపై పడిపోవడమేంటనని అనుకుంటున్నారా.. ఇది చదవండి.

moon nasa

ఈ సంఘటన 1972లో అపోలో-16 మిషన్‌ ప్రయోగంలో జరిగింది. ఏప్రిల్‌ 16న అపోలో-16 వ్యోమనౌకలో 11రోజుల ప్రయోగంలో భాగంగా ముగ్గురు వ్యోమగాములు జాన్‌ యంగ్‌.. థామస్‌ మాట్టింగ్లి2.. ఛార్లెస్‌ డ్యూక్‌జూనియర్‌ ప్రయాణమయ్యారు. విజయవంతంగా చంద్రుడిపై అడుగుపెట్టి నాసా నిర్దేశించిన పనులు చేస్తున్నారు. అయితే.. వెళ్లిన రెండో రోజే.. థామస్‌ మాట్టింగ్లి తన భార్య పెళ్లి రోజున తొడిగిన ఉంగరాన్ని పొగొట్టుకున్నాడు. ఉంగరం పోయిందని భార్యకు తెలిస్తే బాధపడుతుందని ఎలాగైనా ఆ ఉంగరాన్ని వెతకాలని నిర్ణయించుకున్నాడు.

వ్యోమగామిగా తన పనులు చేసుకుంటునే ఉంగరం వెతికాడు. థామస్‌ కోసం మిగతా వ్యోమగాములు కూడా వెతకడం మొదలు పెట్టారు. వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇక దొరకదని ఆశవదిలేసుకున్న సమయంలో.. తొమ్మిదో రోజు మాట్టింగ్లి ఉన్న వ్యోమనౌక వద్దకే ఉంగరం వచ్చింది. కానీ దాన్ని అందుకోలేకపోయాడు. అయితే తన హెల్మెట్‌ సాయంతో ఎట్టకేలకు ఉంగరాన్ని దక్కించుకున్నాడు.

a photo on moon

ఈ విషయాన్ని అపోలో-16లో ప్రయాణించిన వారిలో ఒకరైన ఛార్లెస్‌ డ్యూక్‌ ఇటీవల వెల్లడించారు. విశేషమేమిటంటే.. మాట్టింగ్లి తన భార్య ఉంగరాన్ని పొగొట్టుకొని తిరిగి అందుకుంటే.. ఛార్లెస్‌ మాత్రం తన భార్య.. పిల్లల ఫొటోను చంద్రుడిపై వదిలేసి వచ్చాడు. 1972లో అపోలో 16 ద్వారా చంద్రుడిపై కాలుపెట్టిన చార్లెస్ డ్యూక్ తనకు గుర్తుగా రెండు మూడు అడుగులు వేయడమే కాకుండా ఎప్పటికీ ఒక తీపి జ్ఞాపకంగా ఉండిపోయేలా తన కుటుంబంతో కలిసి దిగిన ఒక ఫొటోని కూడా వదిలేసి వచ్చాడు. అలానే ఆ ఫోటో ఎప్పటికి చెరిగి పోకుండా దానికి ప్రత్యేక పాలిథిన్ కవర్లో అమర్చాడు.

 

- Advertisement -