తప్పిన చైనా రాకెట్‌ ముప్పు..

181
Chinese rocket
- Advertisement -

ఇటీవల చైనా ప్రయోగించిన లాంగ్‌ మార్చ్‌ 5-బీ రాకెట్‌ ముప్పు తప్పింది. వారం రోజులుగా ఎక్కడ పడుతుందా అని టెన్షన్‌ పెట్టిన చైనా రాకెట్‌ శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో పడిపోయాయి. భూ వాతావరణంలోకి రాగానే రాకెట్‌ శకలాలు అధికభాగం మండిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి వైపు దూసుకొచ్చి సముద్రంలో 18 టన్నుల శకలాలు పడిపోయాయి. అవి పశ్చిమ మాల్దీవుల సమీపంలోని సముద్రంలో నేలకూలినట్లు నిర్ధారించారు.

భూ వాతావ‌ర‌ణంలోకి ప్ర‌వేశించిన త‌ర్వాత త‌న భాగాల‌ను చాలా వ‌ర‌కూ కోల్పోయిన రాకెట్‌.. చివ‌రికి స‌ముద్రంలో కూలిపోయిన‌ట్లు చైనా మీడియా వెల్ల‌డించింది. బీజింగ్ కాల‌మానం ప్ర‌కారం ఆదివారం ఉద‌యం 10:24 గంట‌ల (భార‌త స‌మ‌యం ఉద‌యం 07:54)కు లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ భూవాతావ‌ర‌ణంలోకి తిరిగి ప్ర‌వేశించింది. ఆ త‌ర్వాత 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం, 2.65 డిగ్రీల ఉత్త‌ర అక్షాంశాల ద‌గ్గ‌ర కూలిపోయిన‌ట్లు చైనా మ్యాన్డ్ స్పేస్ ఇంజినీరింగ్ ఆఫీస్ వెల్ల‌డించిన‌ట్లు చైనీస్ మీడియా తెలిపింది.

- Advertisement -