ఖగోళంలోకి మరో భారతీయురాలు ఎవరో తెలుసా….

139
nasa
- Advertisement -

ఆకాశంలోని చుక్కలను దూరం నుండి చూసి ఆనందపడతాము. కాని వాటిని తాకాలనే కల ఎంత మంది నేరవేర్చుకుంటారో తెలుసా! వాళ్లను వేళ మీద లెక్కపెట్టచ్చు. అటువంటి వారిలో అతిరా ప్రీత రాణి ఒకరు. అమె కేరళలోని తిరువనంతపురానికి చెందిన అతిరా చిన్ననాటి నుంచే ఖగోళ పరిశోధనలపై మక్కువ పెంచుకుంది. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా తిరువనంతపురంలోనే జరిగింది. కాని ఆమె చిన్న వయస్సులో కెనడాలోని ఒట్టావాలోని అల్గోన్‌క్విన్ కాలేజీలో సీటు తెచ్చుకుంది. అతిరా రోబోటిక్స్ చదివి స్కాలర్‌షిప్ కూడా పొందింది. కాని ఆమె పైలట్‌ కావాలనే కలను నిజం చేసుకొవాలంటే అందుకు ఎయిర్‌ఫోర్స్‌లో జాయిన్‌ కావాలి. కాని ఎయిర్‌ఫోర్స్‌లో చేరకుండా పైలట్‌ కావాలనే కోరికను నాసా తీర్చింది.

ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోనాటికల్ సైన్స్ నిర్వహించిన వ్యోమగామి శిక్షణా కార్యక్రమానికి ఎంపికయ్యింది. శిక్షణా కార్యక్రమాన్నినాసా, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ మరియు నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడా సంయుక్తంగా నిర్వహిస్తాయి. అతిరా వైద్య పరీక్షలతో సహా వివిధ దశలను దాటి శిక్షణా కార్యక్రమాన్నికి ఎంపికయ్యంది. ఈ శిక్షణా కాలం మూడు నుంచి ఐదేళ్ల పాటు కొనసాగే ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యక్తులను నాసా ఎంపిక చేసింది. అతిరా ఈ శిక్షణ పూర్తి చేస్తే కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లే మూడో భారతీయ మహిళ అవుతుంది.

- Advertisement -