వైఎస్‌కు ఘన నివాళి

655
- Advertisement -

ప్రజానేతగా, ప్రజల మనిషిగా సుదీర్ఘ ప్రజా జీవనయానంలో చెరగని ముద్ర వేశారు వైఎస్‌. మూడు దశాబ్దాలకు పైబడిన ప్రజాప్రాతినిథ్య ప్రస్థానంలో ఒడుదొడుకులెదుర్కొని, పేదల కష్టాలను అతి సమీపం నుంచి చూసి చలించిన రాజకీయ నేత. పార్టీనే కాదు.. ప్రజలను కూడా కష్టాల కడలి నుంచి తీరం చేర్చి ధీరత్వం మహానేత. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి వారి పాలిట నిజంగా దేవుడిగా మారిపోయారు. ప్రజాసంక్షేమమే పరమధర్మంగా శ్రమించిన వైఎస్సార్‌ ఎప్పటికీ చిరస్మరణీయుడని ఆయన పథకాల ద్వారా లబ్ధిపొందిన వారు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉన్నత చదువులు చదివించిందని, ఇందిరమ్మ పథకంతో సొంతింటి కల నెరవేరిందని ఆ మహనీయుడిని కొనియాడు. తాము బతికున్నంత వరకు ఆయన తమకు దేవుడని చెప్పారు.

ysr

మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏడవ వర్థంతి ఉమ్మడి రాష్ట్రాల్లో వైసీపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆయన తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డి, సోదరి షర్మిల తదితరులు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

YSR
ఉమ్మడి ఏపీని పరిపాలించిన ముఖ్యమంత్రులలో దివంగతనేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి ఉన్న ప్రాధాన్యత విశిష్టమైనది. 2004 మే నెలలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధించడంతో అప్పటికే పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలు పైనే చేశారు.

ysr_

ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళలకు పావల వడ్డీ ఋణాలు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల పెంపు, పేదలకు ఉచిత విద్యుత్ తదితర పథకాలను ప్రవేశపెట్టి పేదల గుండెల్లో వై.ఎస్. నిలిచిపోయారు. రెండవసారి ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డి అదే సంవత్సరం సెప్టెంబరు 2వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డిపై ఎన్ని అవినీతి ఆరోపణలు, విమర్శలు ఉన్నప్పటికీ తాను చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాల ద్వారా ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

ysr

- Advertisement -