తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, తెలంగాణ టెలివిజన్ డెవలప్ మెంట్ ఫోరం స్థాపక అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్ 57వ జన్మదినోత్సవాల్ని టెలివిజన్ ఫెడరేషన్ కార్యాలయంలో ఘనంగా జరిపారు. తెలంగాణ టి.వి. ఫోరం కన్వీనర్ తిరుపతిరెడ్డి కోట, టెలివిజన్ మెకప్ అండ్ హెయిర్ సైలిష్ యూనియన్ అధ్యక్షుడు రాజేంద్ర సింగ్, రచయితల సంఘం ఉపాధ్యక్షులు డా.వెనిగళ్ళ ఆధ్వర్యంలో పలువురు రచయితలు, టెలివిజన్ కళాకారులు ఈ సభలో పాల్గొన్నారు. గత 25 సంవత్సరాలుగా నాగబాల సురేష్ కుమార్ టెలివిజన్ రంగానికి అందించిన సేవలని వారు కొనియాడారు.
‘నాగబాల, శ్రీ ఆదిపరాశక్తి, కొమరంభీమ్, పురాణగాథలు’ లాంటి 23 సీరియల్స్, 802 డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించి 12 ప్రతిష్టాత్మక నంది అవారులని, తెలంగాణ ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని అందుకున్న సురేష్ కుమార్ డబ్బింగ్ సీరియల్స్ ఉద్యమంతో టెలివిజన్ పరిశ్రమలోని అన్ని వర్గాలని ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి రాష్ట్ర అసెంబ్లీలో మొదటిసారిగా టెలివిజన్ పరిశ్రమ గురించి శాసన సభ్యులు చర్చించడానికి కారకుడయ్యాడని వారు కొనియాడారు. టెలివిజన్ పరిశ్రమలోని అసంఘటిత కార్మికులను ఏకం చేసి వారికి ప్రత్యేకంగా యూనియన్లను, ఫెడరేషన్‌ను ఆయన ఏర్పాటు చేసారని వారు అన్నారు.
తెలుగు టెలివిజన్ పరిశ్రమ శ్రేయోభిలాషిగా నిరంతరం పలు విధాలుగా కృషి చేస్తున్న నాగబాల సురేష్ కుమార్ మరెన్నో కీర్తి శిఖరాలని అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టి.వి.మేకప్ యూనియన్ ప్రెసిడెంట్, టి.వి. ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎ.హెచ్.రాజేందర్ సింగ్, డా.వెనిగళ్ళ రాంబాబు, వైభవ్ సూర్య, డా.శ్రీనివాస్, బాబు, ప్రసాద్, వేణు, సురేష్, శ్రీహరి, మధు, తిరుపతిరెడ్డి కోట, రాం శంకర్ రావు, మానస్, సాయిశశాంక్, సుధాకర్ కె నాయుడు, శ్రీమతి ఉషారాణి, సూర్య కుమారి, తోటపల్లి సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.