హ్యాపీ బర్త్ డే…రామ్‌ చరణ్‌

353
ram charan
- Advertisement -

తండ్రికి తగ్గ తనయుడిగా సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ సత్తాచాటుతున్న యంగ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌. 2007లో పూరి దర్శకత్వంలో వచ్చిన చిరుతతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చెర్రీ ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు.

తన కెరీర్‌లో రెండో సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు. తెలుగు సినిమా స్థాయిని ‘మగధీర” తో వసూళ్ళ పరంగా వందకోట్లకు పెంచిన చరణ్ ..అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. తన ఆట, పాటలతో మెగా అభిమానులను అలరిస్తున్నాడు. తర్వాత ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ‘ఆరెంజ్’ లో నటించారు. ఆ సినిమా హిట్‌ కాకపోయినా చరణ్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ తరువాత రచ్చ, నాయక్, ఎవడు, తుఫాన్(జంజీర్ రీమేక్), గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ చిత్రాల్లో నటించి మెప్పించారు.

Image result for rrr ram charan press meet

ధృవ చిత్రంలో తన కెరీర్‌లోనే డిఫరెంట్ రోల్ చేసిన చెర్రీ ఫ్యాన్స్‌నే కాదు ప్రేక్షకులను సైతం మెస్మరైజ్ అయ్యేలా చేశారు. ఇక సుకుమార్ దర్శకత్వంలో 1985 నాటి కాలాన్ని తలపిస్తూ తెరకెక్కిన రంగస్థలంతో చెర్రీ మ్యాజిక్ చేశారు. చెవిటివాడిగా అద్భుతనటనను కనబర్చి తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నాడు. చెర్రీ నటన మెగా ఫ్యాన్స్‌నే కాదు సినీ విమర్శకుల ప్రశంసలు పొందేలా చేసింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు . మార్చి 27 న పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ చిట్టిబాబు ఇలాంటి పుట్టినరోజు వేడులు మరెన్నో జరుపుకోవాలని గ్రేట్ తెలంగాణ.కామ్ కొరుకుంటోంది.

- Advertisement -