ఆదివాసీలకు అండగా కాజల్..

391
kajal aggarwal
- Advertisement -

కాజల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఇన్నేళ్ల‌వుతున్నా ఇప్ప‌టికీ ఇమేజ్ విష‌యంలో మాత్రం అస్స‌లు త‌గ్గ‌డం లేదు. దానికి తోడు కుర్ర హీరోయిన్ల‌ను త‌ట్టుకోడానికి హాట్ ఫోటోషూట్స్ చేస్తూనే లైమ్ లైట్‌లో వెలిగిపోతోంది ఈ భామ. వ‌య‌సు 30 దాటినా ఇప్ప‌టికీ అదే దూకుడు. అదే అందాల‌తో చంపేస్తుంది ఈ చంద‌మామ‌. చీర‌క‌ట్టినా.. చుడీదార్ వేసినా.. మోడ్ర‌న్ డ్ర‌స్ వేసినా కాజల్ అందాలకు ఫిదా కావాల్సిందే.

ప్రస్తుతం బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన క్వీన్ మూవీకి రీమక్‌గా రూపొందొస్తున్న పారిస్ పారిస్ చిత్రం చేస్తున్న కాజల్ సడెన్‌గా సమాజ సేవలో దిగిపోయింది. ఏపీలోని అరకు లోయ ప్రాంతంలో ఉన్న పిల్లలకు స్కూల్ కట్టిస్తానని మాటిచ్చింది.

ఓ న్యూస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కాజల్ పెళ్లితో పాటు చారిటీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఆదివాసీ పిల్లలు స్కూల్ లేక ఇబ్బందులు పడడం చూశానని తెలిపిన వారికోసం స్కూల్ నిర్మాణానికి కావాల్సిన డబ్బును విరాళంగా ఇచ్చానని తెలిపింది.

ఇక నన్నెవరు కలిసినా నా పెళ్లి గురించే అడుగుతున్నారు. కానీ, ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని నిజంగా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అందరికీ ముందే చెప్తానని స్పష్టం చేసింది. ప్రస్తుతం పారిస్ పారిస్ మూవీతో పాటు కోమలి, సీత సినిమాల్లో నటిస్తోంది కాజల్.

- Advertisement -