అమ్మ కళ్యాణ మండపాలు

214
- Advertisement -

తనను గట్టెక్కించిన అమ్మ సంక్షేమపథకాలను క్షేత్రస్థాయిలో మరింతగా తీసుకువెళ్లాలని సీఎం జయలలిత భావిస్తున్నారు. 2011లో ల్యాప్‌ట్యాప్‌లు, ఫ్యాన్లు, మిక్సీలు, గ్రైండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించి గద్దెనెక్కిన జయ… ‘అమ్మ’ మార్కు ఉచిత పథకాలను చాలానే ప్రవేశపెట్టారు. ‘అమ్మ’ క్యాంటీన్లు, ‘అమ్మ’ వాటర్, ‘అమ్మ’ కూరగాయలు, ‘అమ్మ’ మెడికల్ షాపులు, ‘అమ్మ’ సిమెంట్, ‘అమ్మ’ ఉప్పు అమ్మ జిమ్లు … ఇలా పలు పథకాలు ప్రారంభించి ప్రజల మన్ననలు పొందుతున్నారు.

jayalalitha-

తాజాగా మరో పథకాన్ని ప్రకటించింది జయలలిత. తమిళనాడు ప్రజలకు ఇక అమ్మ కల్యాణ మండపాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగానే రూ.83కోట్లు వెచ్చించి రాష్ట్రంలోని 11 ప్రాంతాల్లో ఈ కల్యాణ మండపాలను ప్రభుత్వం నిర్మించనుంది. కల్యాణ మండపాలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. పేద, సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు జయలలిత తెలిపారు.

amma baby

రాష్ట్ర హౌసింగ్ బోర్డు,సహకార సంఘాలు ఆధ్వర్యంలో మండపాల నిర్మాణం చేపట్టనుంది. వరుడు,వధువులతో పాటు అతిథి గదులు, భోజనశాల, వంటగది ఉండే ఈ కల్యాణ మండపాలలో ఎయిర్ కండిషనర్ సదుపాయం కూడా ఉంటుంది. తోండియార్ పేట, వెలాచెరి, అయపాక్కం, పెరియార్ నగర్, కొరట్టార్ (చెన్నై), అన్నానగర్ (మధురై), అంబ సముద్రం (తిరునల్వేలి), సేలం, కొడున్గైయార్( తిరువళ్లూరు),వడమాలైపేట (తిరుపూర్)లో కల్యాణ మండపాలు నిర్మాణం చేపట్టనుంది. అలాగే మురికివాడల్లో పేదల కోసం రూ.1800 కోట్లతో 50వేల గృహాలు నిర్మించనున్నట్లు జయలలిత తెలిపింది.

amma

Amma-Salt

- Advertisement -