రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లోకి అడుగు పెట్టి వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన చెన్నై. నిన్న (ఆదివారం) కింగ్స్ పంజాబ్-చెన్నైతో జరిగిన మ్యాచులో ఓటమిపాలైన విషయం తెలిసిందే. చెన్నై విజయానికి దగ్గరికొ్చ్చి చేజార్చుకుని 4 పరుగులతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఓటమి పట్ల ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోని కాదని స్పిన్నర్ రవింద్ర జడేజాను ముందు బ్యాటింగ్ దించడంపై పలు ప్రశ్నలు వినిపించాయి. ధోని మాత్రం జెడేజాను పంపించాడు.
‘బ్యాటింగ్‌కు ఎవరిని పంపించాలని నిర్ణయం తీసుకోవడం ఆ పరిస్థితుల్లో డౌట్‌లో ఉన్న ఫ్లెమింగ్‌కు చాలా కష్టం. మేమందరం పూర్తి నమ్మకం జడేజాపై ఉంచాం. రవింద్ర జడేజా ఎడమ చేతి ఆటగాడు కాబట్టి అందుకే ఆతన్ని పంపించాం. ఎడమ చేతివాటం ఆటగాళ్లకు బౌలర్లు స్థిరంగా బంతులు వేయలేరు. కాబట్టి అతనికి అవకాశం ఇచ్చి చూశాం. ఒకవేళ అతని వల్ల కాకుంటే మ్యాచ్‌ను ఫినిష్ చేసే సత్తా ఉన్న హిట్టర్ బ్రేవో ఎలాగు ఉన్నాడని భావించాం.
బ్రేవో మా వెనుకాలే ఉంటూ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. కానీ మొత్తానికి జడేజా లేక ఎవరైనా ఫినిషర్‌గా రాణిస్తే అది మాకు మంచిదే కదా..! కాకపోతే ఇలాంటి అవకాశం జడేజాకు ఇంతవరకు ఎప్పుడూ ఇవ్వలేదు. అతను ఆ ప్లేస్‌లో బ్యాటింగ్ చేయడానికి సరైన అర్హుడు. జడేజాను రాబోయే మ్యాచ్‌ల్లో బాగా ఆడేలా ప్రోత్సహిస్తానన్నాడు మహేంద్ర సింగ్ ధోని.