- Advertisement -
నిజామాబాద్ జిల్లాలో బంజార తీజ్ పండుగ ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ఎంపీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత గిరిజన యువతీ,మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. అనంతరం ఉయ్యాల ఊగారు. తీజ్ పండుగను లంబాడీలు నృత్యం చేస్తూ ఆనందంగా జరుపుకున్నారు. గిరిజనుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని కవిత చెప్పారు.
ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఎలా నిర్వహిస్తుందో గిరిజనుల సంప్రదాయ పండుగైన తీజ్‌ను కూడా అలాగే నిర్వహిస్తుందని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. రిజర్వేషన్లకు సంబంధించి సీఎం కేసీఆర్ ఒక్కసారి కమిట్ మెంట్ తీసుకుంటే వెనక్కి తీసుకోరని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రతీ పండుగను ఘనంగా నిర్వహిస్తోందన్నారు. తీజ్‌ను కూడా ప్రభుత్వపరంగా ఘనంగా నిర్వహించడానికి తనవంతు కృషి చేస్తానని ఆమె చెప్పారు.
- Advertisement -