పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ కవిత..

261
mlc kavitha
- Advertisement -

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రం, ఫులాంగ్ చౌరస్తా లోని పులాంగ్ పార్కును ఎమ్మెల్సీ క‌విత ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి సందర్శించారు. పార్కు నిర్మాణ ప‌నుల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. పార్కు సంద‌ర్శ‌న కంటే ముందు.. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త అధ్వర్యంలో చేపట్టిన ఉచిత భోజ‌న వితరణ ముంగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ క‌విత పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ.. భోజ‌న విత‌ర‌ణ కార్య‌క్ర‌మం చాలా గొప్ప‌ది అని పేర్కొన్నారు. క‌రోనా స‌మ‌యంలో ఈ కార్య‌క్ర‌మం చాలా మందికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. ఇంకా కొద్ది రోజులు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్, బోర్గాం (పి) గ్రామంలో ఎమ్మెల్సీ కవిత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, మేయర్ దండు నీతూ కిరణ్, మాజీ ఎమ్మెల్సీ నర్సా రెడ్డి మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -