హరీషన్నకే మా ఓటు

656
harishrao
- Advertisement -

సిద్ధిపేట… ఈ నియోజకవర్గం పేరు చెబితేనే మనకు టక్కున గుర్తుకొచ్చే పేరు హరీష్‌ రావు. ఉద్యమాలకు, రాజకీయాలకు పెట్టింది పేరైన ఈ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. తెలంగాణ ఉద్యమంలోనైనా, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది. సిద్ధిపేట అనగానే మనకు ఏదో ఒక ట్రెండ్ క్రియేట్ చేయడంలో ముందుంటుంది.

harishrao3009

త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలోని ఓటర్లు కొత్త ట్రెండ్‌ను క్రియేట్‌ చేసే విధంగా నియోజకవర్గం మొత్తం హరీషన్నకే మద్దతు ఇస్తున్నట్లు మనకు స్పస్టంగా కనిపిస్తోంది. నియోజకవర్గం మొత్తం హరీషన్న వెంటే ఉన్నామంటూ ప్రతీనలు బూనుతున్నారు. ఇప్పటికే తాము హరీషన్నకే, కారుగుర్తుకే ఓట్లువేస్తామంటూ సిద్ధిపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు, కులసంఘాల నాయకులు పేర్కొన్నారు. తాజాగా సిద్ధిపేటలో హరీష్‌ రావు గెలవాలంటూ ఆర్యవైశ్య సంఘం నాయకులు తమ మద్దతు ప్రకటించారు.

ఆర్యవైశ్య మహిళలు, పిల్లలు పెద్దలు తమ మొక్కుల కోసం తిరుపతి వెంకన్నకు హుండీలో వేసేందుకు ఇంట్లో దాచుకున్న గల్లపెట్టెలో దాచుకున్న డబ్బులను మంత్రి హరీష్‌ రావుకు అందజేశారు. కిట్టి పార్టీల కోసం దాచుకున్న డబ్బులను కూడా హరీష్‌ రావుకు అందజేశారు. దీన్ని బట్టి చూస్తే హరీష్‌ రావుపై నియోజకవర్గంలోని ప్రజలు ఎంత ప్రేమను చూపుతున్నారో మనకు అర్ధమవుతోంది. తమ నాయకున్ని మళ్లీ గెలిపించుకునేందుకు ఊళ్లకు ఊళ్లు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. ఈసారి హరీషన్నను లక్ష మెజార్టీతో గెలిపించి రికార్డు తిరగరాస్తామని సిద్ధిపేట నియోజకవర్గ ప్రజలు ఘంటాపథంతో చెబుతున్నారు.

- Advertisement -