బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్‌

190
kaushal-manda
- Advertisement -

112 రోజుల బిగ్‌బాస్‌ 2 షో ప్రస్థానానికి తెరపడింది. తెలుగు బిగ్‌బాస్‌ 2 విజేత ఎవరో తెలిసిపోయింది. అందరూ ఊహించినట్టుగానే బిగ్ బాస్‌ 2 విజేత కౌశల్‌ నిలిచాడు. 18 మంది కంటెస్టెంట్ తో పోటీ పడి కౌశల్ విజేతగా నిలిచాడు. కౌశల్‌ బిగ్ బాస్‌ 2 విజేత అని తెలియగానే కౌశల్‌ ఆర్మీ పండుగ చేసుకుంటోంది. కౌశల్‌ గెలవాలంటూ ఎన్నో రోజుల నుంచి యాక్టివ్‌గా పనిచేసిన ఆయన అభిమానులు ఇవాళ సంతోషంలో మునిగిపోయారు.

kaushal-manda

ఇవాళ ప్రసారమైన బిగ్‌బాస్‌ 2 ఫైనల్‌ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా విక్టరీ వెంకటేష్‌ హాజరయ్యారు. బిగ్‌బాస్‌ 2 ఫైనల్‌కు ఐదుగురు ఫైనల్ కంటెస్టెంట్లలో ముందుగా సామ్రాట్ ఎలిమినేట్ కాగా.. తర్వాత దీప్తి, తనీశ్ ఎలిమినేట్ అయ్యారు. తర్వాత కౌశల్, గీతా మాధురి మాత్రమే ఇద్దరు ఫైనలిస్టులుగా మిగలగా.. వాళ్లను హోస్ట్ నాని స్టేజీ మీదికి తీసుకొచ్చారు. తర్వాత విక్టరీ వెంకటేశ్ ప్రత్యేక అతిథిగా వచ్చి కాసేపు నవ్వించారు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ ను టీవీలో చూపించారు. అనంతరం వెంకటేశ్ చేతుల మీద బిగ్ బాస్ ట్రోఫీ, 50 ల‌క్ష‌ల‌ క్యాష్ ను అందుకున్నాడు. తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కు బై బై చెప్పేశాడు నాని. మొత్తానికి ఎన్నో వివాదాలు, విమర్శలతో సాగిన బిగ్‌బాస్‌ 2 సీజన్‌కు నేటితో తెరపడింది.

- Advertisement -