చెర్రీ చిరుతకు 11 ఏళ్లు..

275
ramcharan
- Advertisement -

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటికి 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. మెగాస్టార్‌ చిరంజీవి తనయుడిగా వెండితెరపై చిరుత మూవీతో చిరుతాల తెరంగెట్రం చేసినా రామ్‌చరణ్‌ మెగాపవర్‌ స్టార్‌గా మెగా అభిమానుల మనసు దోచుకున్నాడు. హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే తన ముద్ర వేసిన చెర్రీ మగధీర సినిమాతో స్టార్‌ హీరోగా ఎదిగాడు. రామ్‌చరణ్‌ నటించిన చిరుత మూవీ విడుదలై నేటితో 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. దీంతో చెర్రీ తెలుగు చిత్రపరిశ్రమలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు.

ramcharan- upasana

అయితే రామ్‌చరణ్‌ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన భార్య ఉపాసన సోషల్‌ మీడియాలో ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. మిస్టర్ సి. మై ల‌వ్ .. నీ వృత్తిలో 11 ఏళ్ళు పూర్తి చేసుకున్నావు. నీ ఫేమ్‌ని, స‌క్సెస్‌, ఫెయిల్యూర్‌ని ఓ ప‌ద్ధ‌తిలో నువ్వు హ్యాండిల్ చేసిన తీరుని నేను ప్రేమిస్తున్నాను. నీ ప్రేమ‌, బ‌లంలో ఆశ్ర‌యం తీసుకోవ‌డం నేర్చుకున్నాను. త‌దుపరి 11 సంవ‌త్సరాలు కూడా నీతో షేర్ చేసుకోబోతున్నందుకు ఆనందంగా ఉంద‌ని ఉపాసన తెలిపింది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్‌ యాక్షన్‌ మూవీ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్‌లుక్‌ అక్టోబర్‌ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -