కొంతమంది ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. మునుగోడు ఉప ఎన్నిక వేళ చండూరు సభ వేదికగా సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కార్, ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిని వేదికపైకి తీసుకొచ్చారు. మీకు వంద కోట్ల రూపాయలు ఇస్తాం.. మీరు పార్టీ విడిచిపెట్టి రమ్మని చెప్పి.. వాళ్లను ఎడమకాలి చెప్పుతో కొట్టి అమ్ముడుపోవుడు కాదురా.. మేం అంగట్లో సరుకు కాదు.. తెలంగాణ బిడ్డలమని.. తెలంగాణ ఆత్మగౌర బావుటాను హిమాలయపర్వతం అంత ఎత్తుకు ఎత్తారు.
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రెగా కాంతారావు లకు తెలంగాణను కాపాడిన బిడ్డలు. వందకోట్లు ఇస్తామన్నా గడ్డిపోచతో సమానంగా విసిరికొట్టారు. వందల కోట్ల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను, ఇతరులను సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కొలగొట్టే అరాచక వ్యవస్థ మంచిదా? అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో నిన్న మొన్న చూసింది ట్రైలర్ మాత్రమే… అసలు సినిమా ఇంకా ముందు ఉంది.
– టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం శ్రీ కేసీఆర్#MunugodeWithTRS #VoteForCar pic.twitter.com/KPkBtBW7aU
— TRS Party (@trspartyonline) October 30, 2022
ఇవి కూడా చదవండి
ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు ఎక్కడుందంటే.?
సమంతకు సోకిన వ్యాధి ప్రమాదకరమా ?
జోడో యాత్రలో దొంగలున్నారు జాగ్రత్త.!