వావ్.. చిరంజీవికి విద్యార్థుల అరుదైన గిఫ్ట్

124
- Advertisement -

చిరంజీవిపై ఫ్యాన్స్ ప్రేక్షకులే కాదు.. విద్యార్థులు సైతం తమ అభిమానాన్ని చాటుకున్నారు. చిరంజీవి 154 సినిమాకు సంబంధించి శుభాకాంక్షలు చెబుతూ మల్లారెడ్డి కాలేజి స్టూడెంట్స్ మూవీ టీమ్ కు ఓ స్పెషల్ గిఫ్ట్ ను అందించారు. కాలేజి స్టూడెంట్స్ వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాలేజి స్టూడెంట్స్ అంతా కలిసి మానవ హారం రూపంలో కూర్చున్నారు. పైనుంచి చూస్తే… వాళ్ళు కూర్చునది ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవి లుక్‌లా ఉంది. తమ యూనివర్శిటీ మైదానంలో ‘వాల్తేరు వీరయ్య’ లుక్‌ డ్రా చేసి.. ఆ ఆకారంలో సుమారు ఆరు వేలమంది కూర్చొన్నారు. సంబంధిత విజువల్స్‌ను చిత్రీకరించి.. శనివారం సాయంత్రం తమ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘క్యాన్సర్‌పై పోరాటం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన చిరంజీవిని సర్‌ప్రైజ్‌ చేస్తూ ఆ వీడియోను ప్లే చేశారు. ఆ వీడియోను చిత్ర దర్శకుడు బాబీ ట్విటర్‌ వేదికగా ఆదివారం షేర్‌ చేశారు. ‘వావ్‌, అదుర్స్‌’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. సినిమా అప్‌డేట్స్‌ కావాలని దర్శకుడిని కోరుతున్నారు.

 

ఇవి కూడా చదవండి

మొన్నటిది ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా : కేసీఆర్

ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు ఎక్కడుందంటే.?

సమంతకు సోకిన వ్యాధి ప్రమాదకరమా ?

- Advertisement -