కేజ్రీ సమోసాలకు కోటి రూపాయలు…

282
aravind samosa
aravind samosa
- Advertisement -

టీ, సమోసాల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల కాలంలో రూ. 9 కోట్లను ఖర్చు చేసిందని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా రాజకీయాల్లోని అవినీతిని పారదోలుతానంటూ కొత్తగా రంగప్రవేశం చేసిన ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సర్కార్‌ కూడా ఇందుకు అతీతం కాదని నిరూపించింది. గడచిన ఏడాదిన్నర కాలంలో చాయ్, సమోసాల కోసమే కేజ్రీ సర్కారు ఏకంగా రూ.1 కోటికి పైగా ఖర్చు చేసిందట. ఈ ఖర్చులో ఒక్క కేజ్రీ ఖర్చే రూ.47 లక్షలుందట. ఇక కేజ్రీ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా ఉన్న మనీశ్ సిసోడియా రూ.17 లక్షలు చేశారు.

Arvind-KejriwalKejriwalSnacksExpenditure

కేజ్రీ, సిసోడియాలు మినహా ఢిల్లీ కేబినెట్ లోని మంత్రులు ఏడాదిన్నర కాలంలో చాయ్, సమోసాల కోసం రూ.36 లక్షలు వెచ్చించారు. ఈ నిధులను వారంతా తమను కలిసేందుకు వచ్చిన వారికి చాయ్, సమోసాలు అందించేందుకే ఖర్చు చేశారు. వివేక్ గర్గ్ అనే ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు వచ్చిన సమాధానంలో ఈ ఆసక్తికర అంశాలున్నాయి.

కాగా, టీ, సమోసాల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు చేసింది. అత్యధికంగా మంత్రి అరుణ్‌కుమార్‌ కోరి ఈ నాలుగేళ్లలో 22,93,800 ఖర్చు చేశారు. ఆ తర్వాత స్థానంలో మంత్రి ఆజమ్‌ఖాన్‌ నిలిచారు. రూ.22 లక్షలు ఆయన స్నాక్స్‌ కోసం ఖర్చు చేశారు. మంత్రుల్లో సదాబ్‌ ఫాతిమా రూ.72వేలు ఖర్చు చేసి చివరి స్థానంలో నిలిచారు.

- Advertisement -