ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజ

199
ganesh idol
- Advertisement -

గవర్నర్ నరసింహన్ దంపతులు వినాయక చవితిని పురస్కరించుకుని ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. అనంతరం గవర్నర్ దంపతులు మహా గణపతికి తొలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ గవర్నర్ దంపతులకు శాలువా కప్పి సత్కరించారు.

governor narasimhan

వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. మహాగణపతికి తాను తొలిపూజ చేయడం ఇది వరుసగా ఆరో ఏడాది అని తెలిపారు. వినాయకుడిని పూజించడం వల్ల అందరి విఘ్నాలు తొలగిపోతాయన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని గణేశుడిని ప్రార్థించినట్లు చెప్పారు. పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తోపాటు పలువురు నేతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కాగా, ఖైరతాబాద్ మహాగణపతికి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పోలీసులు ప్రాంగణం నలువైపులా 200మీటర్ల వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సుమారు 100మంది పోలీసులు బందోబస్తులో నిమగ్నమవుతున్నారు. 25మంది ఎస్సైలు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఒక డీఎస్పీ 24గంటల పాటు భద్రతను పర్యవేక్షించనున్నారు. వీరితోపాటు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది, వందమంది వాలంటీర్లు, నాలుగు డోర్ ఫ్రేమ్ డిటెక్టర్లు, భవనాలపై బైనాక్యులర్స్‌తో ప్రత్యేక నిఘా బృందం, ఓ ప్లాటూన్ పోలీసు సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయి.

- Advertisement -