- Advertisement -
బీసీసీఐపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. తన 17 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో రిటైర్మెంట్ సమయంలో తనకు తగిన గౌరవం ఇవ్వకుండా బీసీసీఐ తన కెరీర్‌ని ముగించేసిందన్నారు. చివరి మ్యాచ్‌ను అభిమానుల మధ్య ముగించే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు.
కేవలం తనకు మాత్రమే కాదు గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి వారికి సరైన వీడ్కోలు ఇవ్వలేదని బీసీసీఐని విమర్శించారు.
భారత్ సాధించిన రెండు ప్రపంచ కప్‌లలో ముఖ్య పాత్ర పోషించాడు యువరాజ్ సింగ్. ఇక తన కెరీర్‌లో మొత్తం 40 టెస్ట్ లు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్లు ఆడిన యువరాజ్ వరుసగా 1900, 8701, 1177 పరుగులు చేశాడు.
- Advertisement -