మళ్లీ తండ్రైన యువరాజ్

30
- Advertisement -

టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ మరోసారి తండ్రయ్యాడు. యువీ భార్య హేజెల్ కీచ్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు యువరాజ్. తన భార్య, కొడుకు, కూతురుతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ…తన ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు.

నిద్ర లేకుండా గడిపిన రాత్రులు ఆనంద ఘడియలుగా మారాయని చెప్పాడు. యువరాణి ఆరా రాకతో తమ కుటుంబం పరిపూర్ణమయిందని తెలిపాడు.

Also Read:రాజకీయాల్లోకి రాను:రాహుల్ సిప్లిగంజ్

2016లో యువరాజ్ సింగ్, హేజెల్ కీచ్ వివాహం జరుగగా వారికి కొడుకు ఒరియాన్ పుట్టాడు. 2019లో క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు యువరాజ్ సింగ్.

- Advertisement -