బాలయ్యకు బర్త్‌డే విషెస్‌ చెప్పిన యువరాజ్ సింగ్..

59
Balakrishna

ఈరోజు హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత క్రికెటర్‌ మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా బాలయ్యకు సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్‌డే నందమూరి బాలకృష్ణ సార్‌. మీ నటనతో, మానవతా దృక్పథంతో మీరు చేస్తున్న సేవ నిస్వార్థంగా కొనసాగాలని కోరుకుంటున్నా. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నా.. ఇవే మీకు నా బెస్ట్‌ విషెస్‌’ అంటూ ట్వీట్‌ చేశాడు. అంతేకాదు, గతంలో తాను బాలయ్యతో కలిసి ఉన్నప్పటి ఫొటోను కూడా పంచుకున్నారు.

ప్రస్తుతం యువరాజ్‌ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగ, యువీ గతంలో క్యాన్సర్ బాధితుడన్న సంగతి తెలిసిందే. 2011 వరల్డ్ కప్ తర్వాత ఈ డాషింగ్ ఆల్ రౌండర్ క్యాన్సర్ బారినపడ్డాడు. అయితే మొక్కవోని పట్టుదలతో క్యాన్సర్ ను జయించిన యువీ కూడా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. హైదరాబాదులో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ద్వారా క్యాన్సర్ రోగులకు బాలకృష్ణ అందిస్తున్న సేవలు యువరాజ్ సింగ్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి.