ఇటీవలె అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన యువరాజ్ సింగ్ కెనడా టీ20లో మెరుపులు మెరిపించాడు. బ్రాంప్టన్ పూల్వ్స్తో జరిగిన మ్యాచ్‌లో టొరంటో నేషనల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న యువీ తన బ్యాట్‌కు పని చెప్పాడు.
కేవలం 22 బంతుల్లో 51 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. కళ్లు చెదిరే 5 సిక్స్‌లు,3 ఫోర్లతో మెరుపులు మెరిపించాడు. అయితే జట్టును మాత్రం గెలిపించడంలో విఫలమయ్యాడు యువీ. 11 పరుగుల తేడాతో యువీ జట్టు గెలిపించడంలో విఫలమైంది.
మ్యాచ్ హోరాహోరీగా సాగింది…. యువీ నమ్మశక్యం కాని ఇన్నింగ్స్ ఆడి మమ్మల్ని ఓడించినంత పనిచేశాడని బ్రాంప్టన్ పూల్వ్స్ కెప్టెన్ కొలిన్ మున్రో. ఆ తర్వాత మాంట్రియల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు యువీ.
What an entertainer!@YUVSTRONG12 hammered the bowling attack in his innings of 51(22).
The Southpaw hit five big sixes.#GT2019 #BWvsTN @TorontoNational @BramptonWolves pic.twitter.com/Ts5C9FQfk0
— GT20 Canada (@GT20Canada) August 4, 2019