సదర్ ఉత్సవాలకు ‘యువరాజ్’ రెడీ..

385
- Advertisement -

సదర్‌ ఉత్సవాలకు సిటీ ముస్తాబయింది. ప్రతియేటా దీపావళి తర్వాత సదర్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుటారు యాదవులు. దున్నపోతులను అందంగా అలంకరించి.. ప్రధాన కూడళ్లలో ప్రదర్శన నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల కోసం ప్రత్యేకంగా హరియానా నుంచి విరాట్‌, యువరాజ్‌, రాజ, బాదల్‌ అనే దున్నలను తెప్పించారు. నగరంలో జరగనున్న సదర్‌ సమ్మేళనంలో ఈ దున్నలు సందడి చేయనున్నాయి

హైదరాబాద్‌ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో సదర్‌ పండగ ప్రత్యేకమైనది. సంక్రాంతి, ఉగాది, దీపావళి, బతుకమ్మ, బోనాలు, వినాయకచవితి తరువాత ఆ స్థాయిలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఈ ఉత్సవాలను నగరంలోని యాదవ కులస్తులు మాత్రమే జరుపుకోవడం విశేషం. దీపావళి ఉత్సవాల్లో భాగంగా సదర్‌ను నిర్వహించుకుంటారు. దీపావళి ముగిసిన రెండో రోజున అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ‘సదర్‌’ అంటే హైదరాబాదీ వ్యవహారికం ప్రకారం ‘ప్రధానమైనది’ అని అర్థం.

BLink_Sadara-Color

నగరంలోని కాచిగూడ, నారాయణగూడ, ఖైరతా బాద్‌, సైదాబాద్‌, బోయిన్‌పల్లి, ఈస్ట్‌మారెడ్‌ పల్లి, చప్ప ల్‌బజార్‌, మధురాపూర్‌, పాతబస్తీ తదితర మరికొన్ని ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ పండగను దృష్టిలో పెట్టుకొని దున్న పోతులను పెంచుతారు. కొన్ని నెలలపాటు వాటికి పోషక విలువలు కలిగిన తవుడు, దాన, గానుగ, పచ్చగడ్డి, కుడితి వంటివి పెట్టి పెంచుతారు. పండగకు వారం ముందుగానే అలంకరణ ప్రారంభిస్తారు. దున్నపోతు శరీరంపై ఉన్న వెంట్రుకలను తొలగించి నల్లగా నిగనిగలాడేలా తయారు చేస్తారు. అందుకు వెన్న లేదా పెరుగు ఉపయో గిస్తారు. కొమ్ములను రంగురంగుల రిబ్బన్లతో చుడ తారు. నెమలి ఈకలను అమర్చుతారు. అలంకరించిన తరువాత సుగంధ ద్రవ్యాలను చల్లుతారు.

sujay

అలంకరించిన దున్నపోతులతో ఉత్సాహం కలిగిన యువకులు కుస్తీ పడతారు. ముక్కుతాడును చేతబట్టు కొని అదుపు చేస్తారు. ఈ క్రమంలో దున్నపోతు తన ముందరి కాళ్లను పెకెత్తి యువకుడిపైకి ఉరికి వస్తుంది. అయితే భారీ శరీరం కావడం వలన అది తప్పించు కుపోయే అవకాశం ఉండదు. గత కొన్నేళ్లుగా సదర్ ఉత్సవాలలో హైదరాబాదీలను విశేషంగా ఆకర్షిస్తున్న యువరాజ్ ఈసారీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది. 1800 కిలోల బరువు ఉండే యువరాజ్ 17 సార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. ముర్ర జాతికి చెందిన విభాగంలో వరల్డ్ బెస్ట్ బుల్ అవార్డును ఇది సొంతం చేసుకున్నది. హర్యానా రాష్ట్రం నుంచి ప్రత్యేక కంటెయినర్ లో నగరానికి తీసుకొచ్చారు.

maxresdefault

చూడటానికి భారీ కాయంతో ఉండే ఈ దున్నపోతులు వాటి ఆకారంతోనే నగరవాసులను ఆకర్షిస్తున్నాయి. అయితే వీటి ఇలా తయారుచేయడానికి చాలా ఎక్కవే ఖర్చుచేయాలి. ప్రతి రోజూ 25 లీటర్ల పాలు, 100 ఆపిల్స్, 5 కేజీల ఖాజు, 5 కేజీల బాదాం పప్పు, 5 కేజీల ఖజూర్ తో పాటు 5 కేజీల క్యారెట్ ను వీటికి ఆహారంగా ఇస్తారు. ఈ రాజా వారికి దినసరిలో భాగంగా వ్యాయామం కూడా చేయిస్తారు. ప్రతి రోజూ ఐదు కిలోమీటర్ల నడక తరువాత ఆవనూనెతో మసాజ్‌ చేసి ప్రత్యేక పంపులతో నీటిని వెదజల్లి రోజుకు రెండు సార్లు డెటాల్ సబ్బుతో స్నానం చేయిస్తారు.

- Advertisement -