ఏపీ నుండి రాజ్యసభకు అదానీ భార్య!

103
jagan
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల హడావుడి నెలకొంది. ఏపీలో 4, తెలంగాణలో గతంలో విడుదలైన నోటిఫికేషన్‌తో కలిపి 3 స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఇక ఏపీ నుంచి విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, సురేశ్ ప్రభు రిటైర్ కానున్నారు. ఖాళీ అవబోతున్న వారి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు స్ధానాలు వైసీపీకే దక్కనున్నాయి.

వైసీపీ నుండి ఛాన్స్ దక్కించుకునే వారిలో ప్రముఖంగా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ భార్యకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అలాగే సీఎం వైఎస్ జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మైనార్టీ సామాజిక వర్గం నుంచి సినీ నటుడు అలీ, ఇక్బాల్ పేర్లు వినపడుతున్నాయి.

- Advertisement -