పుష్ప 2 కోసం సుక్కు తీవ్ర కసరత్తు!

15
allu

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ముఖ్యంగా తగ్గేదేలే డైలాగ్‌ దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది. సినీ , రాజకీయ ప్రముఖులు సైతం ఈ డైలాగ్‌ను వాడుతున్నారంటే ఎంతలా సినిమా ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.ఈ నేపథ్యంలో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో సుకుమార్ కథలో మరిన్ని మార్పులు చేస్తున్నారట. దీంతో సెకండ్ పార్ట్ షూటింగ్ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కథతో పాటు ఫస్ట్ పార్ట్ లో హీరో హీరోయిన్ల పెళ్లితో ఎండ్ కాగా రెండో భాగంలో కూడా కథానాయికగా రష్మికనే ఉండగా సెకండ్ హీరోయిన్‌ని తీసుకునే అవకాశం ఉంది.

సెకండ్ హీరోయిన్ తోను పుష్ప రొమాన్స్ ఉంటుందని.. ప్రస్తుతం ఆ కథానాయిక ఎంపిక జరుగుతుందని టాక్ నడుస్తుంది. స్మగ్లింగ్ మాఫియాలో పుష్ప రాజ్ ఆట ఊహకి అందని విధంగా ఉండనుందట. మొత్తంగా సుకుమార్ మార్పులు చేసే కథ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి…