వయసు పెరిగిన తరగని అందం ఆమె సొంతం!

14
tamanna

అందం, అభినయం కలగలసిన కథానాయికల్లో తమన్నా ఒకరు. పాత్ర ఎలాంటిదైనా దానికి తగ్గట్టు తనను తాను మలుచుకోవడంలో ఈ అమ్మడి తీరే వేరు.ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న తన తరగని అందంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది ఈ మిల్కీబ్యూటీ.

ప్రస్తుతం ఎఫ్‌3తో ప్రేక్షకుల ముందుకురానుండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో తమన్నా డ్రెస్సింగ్ అందరిని ఆకట్టుకుంది. రెడ్ హాట్ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాని షేక్ చేసింది. రెడ్ క‌ల‌ర్ ట్రెండీ అవుట్ ఫిట్‌లో, తమన్నా హాట్ అందాల‌ను ఆర‌బోస్తూ యూత్‌కి చెమటలు పట్టించింది.

ఈ రెడ్ డ్రెస్‌లో ఇంకా అందంగా కనిపించి, కవ్విస్తున్నట్లు ఉంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు హాట్ కామెంట్స్ చేశారు. వయసు మీద పడుతున్న అందం ఏ మాత్రం తగ్గలేదని, మిల్కీ బ్యూటీ ఎప్పటికి ఎవర్‌గ్రీన్ అని కామెంట్స్ చేస్తున్నారు.