తిరుపతిలో వైసీపీ గెలుపు..

155
YSRCP
- Advertisement -

తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక బరిలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ఘనవిజయం సాధించారు. ఆయన 2.31 లక్షలకు పైగా మెజారిటీతో తన సమీప టీడీపీ ప్రత్యర్థి పనబాక లక్ష్మిపై గెలుపొందారు. ఫ్యాన్ ధాటికి టీడీపీ, బీజేపీ-జనసేన రెండు, మూడు స్థానాలకే పరిమితం అయ్యాయి. గురుమూర్తి విజయంతో వైసీపీ శ్రేణుల్లో సంతోషం అంబరాన్నంటుతోంది.

మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి తిరుపతి బరిలో వైసీపీకి 5,33,961 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 3,02,580 ఓట్లు లభించాయి. ఆ తర్వాత స్థానంలో బీజేపీ-జనసేనకు 50,354 ఓట్లు వచ్చాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ-జనసేన అభ్యర్థి రత్నప్రభ మొత్తం ఓట్లు ఇప్పటిదాకా కనీసం లక్ష కూడా దాటలేదు. ఇక, కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కు 8,406… సీపీఎంకు 4,978, ఇతరులకు 30,381, నోటాకు 13,175 ఓట్లు వచ్చాయి.

ఈ స్థాయిలో మెజారిటీ రావడంపై వైసీపీ అభ్యర్థి గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలన, సీఎం వైఎస్ జగన్ ఛరిష్మా రెండు కళ్లుగా ఈ గెలుపుకు దోహదపడ్డాయని ఆయన అన్నారు. ప్రజలంతా వైసీపీ వైపే ఉన్నారని.. ప్రజల్లో ఇతర పార్టీల పరిస్థితి ఏంటనేది వారికొచ్చిన ఓట్లను బట్టే తెలుస్తోందన్నారు.

- Advertisement -