Jagan: వైసీపీలో ‘జంపింగ్ జపాంగ్’?

33
- Advertisement -

ఏపీలో ఎన్నికల ముందు రాజకీయలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం పై కన్నేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల 11 నియోజక వర్గాల్లో ఇంచార్జ్ లను మార్చిన ఆయన త్వరలో మరిన్ని మార్పులు చేసేందుకు సిద్దమౌతున్నారట. ఇప్పుడు ఇదే అంశం ఆ పార్టీకి తీవ్ర తలనొప్పి గా మారుతోంది. సిట్టింగ్ స్థానాల్లో కూడా మార్పులు ఉండబోతున్నాయనే సంకేతాలు రావడంతో చాలమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గుబులు మొదలైనట్లు సమాచారం. దాంతో వేటు పడకముందే ఇతర పార్టీలతో కొంత మంది టచ్ లోకి వెళ్ళినట్లు ఏపీ రాజకీయాల్లో గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. వైసీపీకి చెందిన దాదాపు 40 మంది ఎమ్మేల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టిడీపీ శ్రేణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు.

ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ గుసగుసలు నిజమేనేమో అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. కాగా ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఏపీలో కూడా కాంగ్రెస్ ను బలపరిచేందుకు హైకమాండ్ సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో వైసీపీలోని అసంతృప్త నేతలు కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ వైసీపీలోని 20 మంది ఎమ్మేల్యేలు తమతో టచ్ లో ఉన్నారని త్వరలోనే వారంతా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. దీంతో అధికార వైసీపీలో జంపింగ్ జపాంగ్ షురూ అయినట్లేనని రాజకీయ వాదులు చెబుతున్నారు. వైసీపీ పదవులు లేదా సీట్లు దొరకని నేతలంతా ప్రత్యామ్నాయ పార్టీలవైపు అడుగులు వేసే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. మరి అధినేత జగన్ అసంతృప్త వాదులను బుజ్జగిస్తూ వలసలకు ఎలా అడ్డుకట్ట చేస్తారో చూడాలి.

Also Read:శ్రీ‌వాణి ట్ర‌స్టు… 3,615 ఆల‌యాల నిర్మాణం

- Advertisement -