వైఎస్‌ఆర్ రైతు భరోసా..నాలుగో ఏడాది

38
ap
- Advertisement -

ఏపీలో రైతులకు పెట్టుబడి సాయం కోసం వైఎస్‌ఆర్ రైతు భరోసాను సీఎం జగన్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగో ఏడాది సాయాన్ని ఇవాళ అందించనున్నారు జగన్. ఉదయం 10.10 గంటలకు రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు.

వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద ఏటా మూడు విడతల్లో కలిపి రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తోంది. మే లో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో మిగిలిన రూ.2 వేలు చొప్పున జమ చేస్తున్నారు.

ఈ ఏడాది 50,10,275 రైతు కుటుంబాలకు వైఎస్‌ఆర్ భరోసా అందనుండగా ఇందులో భూ యజమానులు 47,98,817, కౌలుదారులు 1,20,000 మంది ఉన్నారు. అటవీ భూ సాగుదారులు 91,458 మందికి పెట్టుబడి సాయం అందనుంది. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ, వక్ఫ్‌ తదితర ప్రభుత్వ భూములను సాగు చేస్తున్న కౌలుదారులకు కూడా ఈ సాయాన్ని వర్తింపజేశారు. ఇప్పటివరకు రూ.23,875.59 కోట్ల లబ్ధి రైతులకు చేకూరింది.

- Advertisement -